జోగులాంబను దర్శించుకున్న టూరిజం ఎండీ

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామిని శుక్రవారం టూరిజం శాఖ ఎండీ ప్రకాశ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈవో పురంధర్ కుమార్, అర్చకులు ఆయనకు ఆహ్వానం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న ప్రసాద్  స్కీం బిల్డింగ్​ను ఆయన పరిశీలించారు. పనులు స్పీడప్​ చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

పూజా సామగ్రి సప్లైకు సీల్డ్  టెండర్లు..

ఏడాది పాటు అలంపూర్  ఆలయాలకు పూజ, కిరాణా సామాగ్రి సప్లై చేసేందుకు ఆలయ ప్రాంగణంలో శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు సీల్డ్  టెండర్లు నిర్వహించారు. మహబూబ్​నగర్, హైదరాబాద్  తదితర ప్రాంతాలకు చెందిన పలు ఏజెన్సీలు టెండర్లు దక్కించుకున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్ శ్రీనివాసరాజు తెలిపారు.