97 లక్షలకు పైగా రికవరీ..ఇది ప్రపంచంలోనే అత్యధికం

97 లక్షలకు పైగా రికవరీ..ఇది ప్రపంచంలోనే అత్యధికం
దేశంలో కొత్తగా 22 వేల 272 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 251 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు కోటి ఒక లక్షా 69 వేల 118కు చేరాయి. ఇప్పటివరకు లక్షా 47 వేల 343 మంది మృతి చెందారని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. దేశంలో కొత్తగా కరోనా కేసులు వస్తున్నా, రికవరీ రేట్ మెరుగ్గా ఉందన్నారు అధికారులు. ఇప్పటివరకు 97 లక్షల 40 వేల 108 మంది  కోలుకున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెప్పారు అధికారులు. రికవరీ రేటు 95.78 శాతం ఉండగా..2.77 శాతం ఆక్టివ్ కేసుల ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 25 వరకు 16 కోట్ల 71 లక్షల 59 వేల 289 శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. Total recovered cases are nearing 97.5 lakh making India's cumulative recoveries highest in the world. Recovery rate at 95.78% today. India’s present active caseload of 2,81,667 consists of 2.77% of India’s total positive cases: Ministry of Health and Family Welfare — ANI (@ANI) December 26, 2020