విజృంభిస్తున్న డెంగ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

విజృంభిస్తున్న డెంగ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. 9రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలకు వైద్య నిపుణుల బృందాలను పంపుతుంది కేంద్రం. మిగతా రాష్ట్రాల్లోనూ డెంగ్యూ కట్టడికి విస్తృతమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు అధికారులు. ఢిల్లీలో కొద్దిరోజులుగా విష జ్వరాల విపరీతంగా పెరిగిపోయాయి.

 పంజాబ్, హరియానా, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, జమ్మూ కశ్మీర్లలో కూడా జ్వరాల సంఖ్య పెరిగింది. కేంద్రం అక్కడ పరిస్థితిని సమీక్షించి, సూచనలు చేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించింది. వ్యాధి నియంత్రణ, నిర్వహణ కోసం డెంగీ యాక్టివ్ గా ఉన్న రాష్ట్రాలకు నిపుణుల బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు.