టాపార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు రాణించాలి : జడేజా

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు ఎక్కువగా రన్స్‌‌‌‌ చేయకపోవడం వల్లే లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతోందని ఆల్‌‌‌‌రౌండర్ రవీంద్ర జడేజా చెప్పాడు. ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టులో టాపార్డర్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు బాధ్యత తీసుకొని బాగా ఆడాలని కోరాడు. ‘విదేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో ఆడుతున్నప్పుడు టాపార్డర్ నుంచి వచ్చే రన్స్ చాలా ముఖ్యం. టాపార్డర్‌‌‌‌‌‌‌‌ రాణించలేకపోతే పరుగులు చేసే బాధ్యతతోపాటు ఒత్తిడి లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై పెరుగుతుంది.

నాలుగో టెస్టులో మా టాపార్డర్‌‌‌‌‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ బాగా రాణిస్తుందని ఆశిస్తున్నా’ అని జడేజా పేర్కొన్నాడు. ఇక, సీనియర్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ అశ్విన్ రిటైర్మెంట్‌‌‌‌ నిర్ణయం చివరి  వరకూ తనకు కూడా తెలియదని జడ్డూ చెప్పాడు. ‘తను నా ఆన్‌‌‌‌ ఫీల్డ్ మెంటార్‌‌‌‌. బౌలింగ్ పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌గా మేం ఎంతో కాలం నుంచి ఆడుతున్నాం. మ్యాచ్ పరిస్థితి గురించి మేం ఇద్దరం గ్రౌండ్‌‌‌‌లో తరచూ మాట్లాడుకునేవాళ్లం. వాటిన్నింటినీ నేను మిస్ అవబోతున్నా’ అని జడ్డూ తెలిపాడు. 

ఆసీస్ మీడియా అతి!

టీమిండియా పట్ల ఆస్ట్రేలియా మీడియా మరోసారి అతి చేసింది. ఎంసీజీ గ్రౌండ్‌‌‌‌లో శనివారం ప్రాక్టీస్‌‌‌‌ సెషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇండియా జర్నలిస్టులతో జడేజా మాట్లాడాడు. ఆహ్వానం లేకపోయినా, అక్రిడిటేషన్‌‌‌‌ కార్డులు కూడా లేని కొందరు లోకల్‌‌ మీడియా ప్రతినిధులు వచ్చారు. ఇండియా మీడియా హిందీలో అడిగిన ప్రశ్నలకు జడ్డూ హిందీలోనే సమాధానం ఇచ్చాడు.  అయితే టీమ్ బస్ బయల్దేరేందుకు సిద్ధం కావడంతో జడ్డూ వెళ్లిపోయాడు.

అంతే ఆసీస్ జర్నలిస్టులు  బీసీసీఐ మీడియా మేనేజర్‌‌‌‌‌‌‌‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. జడేజా ఇంగ్లిష్‌‌లో ఎందుకు మాట్లాడలేదంటూ వాదనకు దిగారు. దీన్ని రికార్డు చేయించి తమ లోకల్‌‌‌‌ చానెల్స్‌‌‌‌లో ప్రసారం కూడా చేశారు. కొన్ని రోజుల కిందట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో తమ చిన్నారులను ఫొటోలు, వీడియాలు తీయొద్దని కోహ్లీ రిక్వెస్ట్ చేస్తే..  అతను జర్నలిస్టులతో వాదనకు దిగాడని ఆసీస్ మీడియా ప్రసారం చేసింది.