నిత్యజీవితంలో ఎప్పుడు బిజీగా ఉండే స్టార్స్..ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అందుకు 2024 ఏడాది వేదికైంది. అందులో కొంతమంది ప్రేమ వివాహాలు, మరికొంత మందిది పెద్దలు కుదిర్చిన వివాహాలు జరిగాయి. వీళ్ళలో హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ తమ దాంపత్య జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో వారి ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరి వారెవరనేది ఓ లుక్కేద్దాం.
రకుల్ ప్రీతిసింగ్-జాకీ భగ్నానీ:
రకుల్ ప్రీతిసింగ్ (Rakul Preethi Singh).. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. వరుస సక్సెస్ లు అందుకున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో సౌత్ నుంచి ఆఫర్స్ కరువయ్యాయి. దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది.
అక్కడ చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన సక్సెస్ రాకపోవడంతో.. తాను ప్రేమించిన నటుడు కం నిర్మాత జాకీ భగ్నానీని 21 ఫిబ్రవరి 2024లో పెళ్లాడింది.
బాలీవుడ్ లో పేరున్న భగ్నానీల కుటుంబంలోకి రకుల్ కోడలుగా అడుగుపెట్టింది. ఆ తర్వాత రకుల్ - జాకీ జంట సంతోషకరమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు నిరంతరం వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఆశిష్ రెడ్డి-అద్వైత రెడ్డి:
ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి(Ashish Reddy), అద్వైత రెడ్డి(Advaitha Reddy)ల వివాహం 2024 ఫిబ్రవరి 14న ఘనంగా జరిగింది. జైపూర్ ప్యాలెస్ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Also Read : న్యూ ఇయర్ వేళ అజిత్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
ఆశీష్ సినిమాల విషయానికి వస్తే:
రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి. మ్యూజికల్ గా మంచి హిట్ ఐన ఈ సినిమా.. కమర్షియల్ గా మాత్రం పెద్దగా సక్సెస్ అవలేదు. ఇక రెండొవ సినిమాగా సెల్ఫిష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కృతి ఖర్బందా-పులకిత్ సామ్రాట్:
హీరోయిన్ కృతి ఖర్బందా (Kriti Kharbanda) తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన కృతి ఖర్బందా 2024 మార్చి 15న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో కృతి ఏడడుగులు వేసింది. వీరి వివాహ వేడుక హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘనంగా జరిగింది.
కృతి ఖర్బందా తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన బోణి మూవీతో ఎంట్రీ ఇచ్చి..తీన్ మార్, అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడీ, ఒంగోలు గిత్త, చివరగా 2015లో రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో నటించింది.ఇక ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశం రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది.
కిరణ్ అబ్బవరం-రహస్య:
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్(Rahasya Gorak)తో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి 2024 ఆగస్ట్ 22న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం సాగించిన ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
We Need all your blessings ❤️? pic.twitter.com/3ibTFUuJp0
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 23, 2024
సిద్దార్ద్-అదితిరావు:
తెలుగు, తమిళ స్టార్ సిద్ధార్ద్ (Siddarth), హీరోయిన్ అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) వివాహం 2024 సెప్టెంబర్ 16న జరిగింది. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో ఈ జోడీ వివాహం చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఈ జంట ఇప్పుడు కలిసి ఏడు అడుగులు వేయడం విశేషం.
నాగ చైతన్య- శోభిత:
అక్కినేని నాగచైతన్య, శోభిత శూలిపాళ వివాహం 2024 డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ స్వర్గీయ నటుడు అక్కనేని నాగేశ్వర రావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో మూడుముళ్ళ బంధంతో ఈ ఇరువురు ఒక్కటయ్యారు. నాగ చైతన్య-శోభిత వివాహానికి అక్కినేని కుటుంబసభ్యులతో దాదాపుగా 500మందికి పైగా అతిథులు హాజరయ్యారు.
జాగర్లమూడి క్రిష్-ప్రీతి చల్లా:
టాలీవుడ్ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ 2024 నవంబర్ లో ప్రీతి చల్లా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా వైద్య వృత్తిలో ఉన్నారు. క్రిష్ పెళ్లి చేసుకున్న డాక్టర్ ప్రీతి చల్లా హైదరాబాద్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ‘గమ్యం, కంచె, వేదం, కొండపోలం లాంటి గొప్ప సినిమాలు తెరకెక్కించారు క్రిష్. ప్రస్తుతం ఆయన హీరోయిన్ అనుష్కతో ఘాటీ మూవీ తెరకెక్కిస్తున్నాడు.
సుబ్బరాజు-స్రవంతి:
టాలీవుడ్ నటుడు సుబ్బరాజు.. స్రవంతి అనే అమ్మాయిని 2024 నవంబర్ 27న పెళ్లి చేసుకున్నాడు. సుబ్బరాజు భార్య స్రవంతి అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీలు పొందారు. సుబ్బరాజు తెలుగు, తమిళ,హిందీ ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. సుమారు 100 చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సందీప్ రాజ్-చాందిని రావు:
సుహాస్ నటించిన 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) ఓ ఇంటివాడయ్యాడు. పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన చాందిని రావు (Chandini Rao) అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
డిసెంబర్ 7న తిరుమల వేదికగా చాందిని రావుతో దర్శకుడు సందీప్ రాజ్ వివాహం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఇరువురి పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.
కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిళ్:
నటి కీర్తీ సురేష్ (Keerthy Suresh) తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిళ్‌తో (Antony Thattil) ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 2024 డిసెంబర్ 12న గోవాలో హిందూ సంప్రదాయంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అలాగే డిసెంబర్ 15న క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో మరోసారి వివాహం చేసుకున్నారు.ఈ పెళ్ళికి టాలీవుడ్, కోలీవుడ్, హిందీ సినీ పరిశ్రమల నుంచి అతిథులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
#ForTheLoveOfNyke pic.twitter.com/krtGlussB3
— Keerthy Suresh (@KeerthyOfficial) December 12, 2024
వరలక్ష్మి శరత్ కుమార్-నికోలాయ్ సచ్‌దేవ్:
నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం 2024 జూలై 2న జరిగింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. థాయ్‌లాండ్‌లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్:
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా 2024 జూన్ 23న రైటర్ జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సోనాక్షి-జహీర్ ఇక్బాల్ పెళ్లి చేసుకున్నారు.