టూల్స్ గాడ్జెట్స్ : టైల్స్​ గ్యాప్​ ఫిల్లర్​ 

సోప్​హోల్డర్​

సాధారణంగా.. బాడీ సోప్​ని ఒక పెట్టెలో పెట్టి, బాత్​రూంలో పెట్టుకుంటారు. కానీ.. దానికి మూత లేకపోతే షవర్​ చేసినప్పుడు ఆ నీళ్లన్నీ సబ్బుమీద పడి అది కరిగిపోతుంది. ఒకవేళ మూత పెడితే వాడిన ప్రతిసారి మూత తీసి, పెట్టాలంటే టైం వేస్ట్​. ఇలాంటి సోప్​ హోల్డర్​ని వాడితే ఆ ఇబ్బందులు ఏవీ ఉండవు. దీన్ని ‘పరిధి’ అనే కంపెనీ మార్కెట్​​లోకి తీసుకొచ్చింది. వాష్​రూంలో గోడకు అతికించుకోవచ్చు. చాలా తక్కువ స్పేస్​ కావాలి దీనికి. ఈ హోల్డర్​కు వెనకవైపు ఉండే ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసేసి, గోడకు అతికిస్తే చాలు. ఈ హోల్డర్​ వల్ల సబ్బు త్వరగా కరిగిపోదు. ఒక్క క్లిక్​తో పెట్టెలో నుంచి సబ్బు బయటకు తీసి వాడొచ్చు. సబ్బు ఉండే ట్రేని పైకి నొక్కితే మళ్లీ మూసుకుపోతుంది. దీని కిందిభాగంలో మరో ట్రే ఉంటుంది. సబ్బు నుంచి కారే నీళ్లు అందులో స్టోర్​ అవుతాయి. ఆ ట్రేని తీసి నీళ్లు పారబోయాలి. దీన్ని  శుభ్రం​ చేయడం కూడా చాలా ఈజీ. 

ధర : 269 రూపాయలు 

టైల్స్​ గ్యాప్​ ఫిల్లర్​ 

బట్టలు ఉతకడం, పదే పదే నీళ్లతో కడగడం వల్ల టైల్స్​ మధ్య ఉండే సిమెంట్​ పోతుంది. దాంతో టైల్స్​ మధ్య గ్యాప్స్​ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్​లో సిలికాన్​ సీలెంట్​తో ఫిల్​ చేస్తే సరిపోతుంది. ఇలాంటి ఫిల్లర్స్​ని మార్కెట్​లో చాలా కంపెనీలు అమ్ముతున్నాయి. ఇది వాటర్ రెసిస్టెంట్​తో వస్తుండడంతో ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. టైల్స్​ పగిలిన చోట వేసినా అతుక్కుంటుంది. దీన్ని సిమెంట్ ట్యూబ్, వాష్ బేసిన్ లాంటి వాటికి కూడా వాడొచ్చు. వాషింగ్ ఏరియా, కిచెన్ టాప్, ఫ్లోర్ టైల్స్​తో ఎక్కడ పగుళ్లు వచ్చినా ఈ సిలికాన్​ సీలెంట్​ వాడితే సమస్య తీరిపోతుంది. 

ధర: 280 మిల్లీలీటర్లకు 269 రూపాయలు 

ఆల్ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్​ రీడర్

సాధారణంగా డాటా స్టోరేజీ కోసం రకరకాల మెమొరీ గాడ్జెట్స్​ వాడుతుంటారు.  వాటన్నింటినీ కంప్యూటర్​కి ఎటాచ్​ చేయడం సాధ్యపడదు. ఎందుకంటే చాలా కంప్యూటర్లకు అన్ని రకాల పోర్ట్స్ ఉండవు. అందుకే ఇలాంటి రీడర్ వాడితే సరిపోతుంది. ఆర్టీఎస్​ అనే కంపెనీ తెచ్చిన ఈ రీడర్​... టీ ఫ్లాష్​, ఎంఎస్​, ఎంఎస్​ ప్రో, ఎంఎస్​ డ్యుయో, ఎంఎస్​ ప్రో డ్యుయో, మినీ ఎస్డీ, ఎస్డీ, ఎంఎంసీ, ఆర్​ఎస్​ ఎంఎంసీ, మైక్రో ఎంఎస్​లకు సపోర్ట్ చేస్తుంది. USB 2.0 480 Mbps  హై స్పీడ్​ డాటా ట్రాన్స్​ఫర్​ చేస్తుంది. దీంతో కంప్యూటర్ నుండి అన్నిరకాల డిజిటల్ గాడ్జెట్స్​కు ఫైల్స్​ ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. కెమెరాలు, మొబైల్స్ లాంటి గాడ్జెట్స్​కు కూడా సపోర్ట్​ చేస్తుంది. రీడ్, రైట్ ఆపరేషన్లు ఈజీగా చేసుకోవచ్చు. 

ధర : 398 రూపాయలు ​

మ్యాగ్నెటిక్ రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్

ఫ్రిజ్​​, ఏసీ లాంటివి బాగుచేసే టెక్నీషియన్స్​ సాధారణంగా ఇళ్లలోకి వెళ్లి రిపేర్లు చేస్తుంటారు. వాళ్లకు గాడ్జెట్స్​ నుంచి తీసిన స్క్రూలను జాగ్రత్త చేయడం పెద్ద టాస్క్​ అవుతుంది. ఎందుకంటే.. ఆ స్క్రూలు చాలా సన్నగా, చిన్నగా ఉండడంతో ఎక్కడ పెట్టినా మళ్లీ వాటికోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే వాటిని తమ చేతికే అతికించుకునేందుకు ఈ మాగ్నెటిక్ రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్​ తెచ్చింది ‘టూల్​బే’ అనే కంపెనీ. ఇది మెకానిక్​లు, ఇంట్లో సరదాగా డీఐవై పరికరాలు తయారుచేసేవాళ్లకు బెస్ట్​ చాయిస్​. ఇది చేతికి కట్టుకునే మామూలు క్లాత్​ బ్యాండ్​లా ఉంటుంది. కానీ.. దాని లోపల 10 బలమైన అయస్కాంతాలు ఉంటాయి. వాటికి స్క్రూలతో పాటు చిన్న వస్తువులు కూడా అతికించుకోవచ్చు. సీలలు, బోల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వాషర్లు, డ్రిల్ బిట్లను ఈజీగా హోల్డ్​ చేస్తుంది. ఈ మల్టీపర్పస్ స్క్రూ హోల్డర్ హోమ్​ ఇంప్రూవ్​మెంట్​, కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్, కార్పెంటరీ, ఆటో రిపేర్ వంటి పనులు చేసేవాళ్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి అడ్జస్టబుల్​ పట్టీ ఉంటుంది. బ్రీతబుల్​ మెష్​తో తయారుచేయడం వల్ల కంఫర్ట్​గా ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్​ రిస్ట్​ బ్యాండ్​ను నడుం బెల్ట్​కు కూడా పెట్టుకోవచ్చు. 

ధర: 1,948 రూపాయలు