ఒక్కరోజే టాలీవుడ్ షేక్.. వర్టికల్‎గా డివైడ్ అయిన పొలిటికల్ పార్టీస్

= చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్

= సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11గా బన్నీ
= 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు
= మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు
= ముందస్తు బెయిల్ కొట్టేసిన న్యాయస్థానం
= వర్టికల్ గా డివైడ్ అయిన రాజకీయ పార్టీలు
= అల్లు అర్జున్ కు బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ సపోర్ట్
= చట్టం తన పని తాను చేసుకు పోతుందన్న కాంగ్రెస్
= పోలీసుల వైఫల్యమేనంటున్న హరీశ్ రావు 

హైదరాబాద్: ఇద్దరు ప్రముఖ నటులు ఇవాళ వార్తల్లో నిలిచారు. బన్నీ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల కుటుంబ వివాదం నేపథ్యంలో మీడియా ప్రతినిధిపై దాడి చేసిన సీనియర్  నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రిజెక్ట్ అయ్యింది. దీంతో ఆయనను ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం ఆయన కోసం పహాడీ షరీఫ్ పోలీసులు ఫిలింనగర్, జల్ పల్లి నివాసాలకు వచ్చారు. 

తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మోహన్ బాబు  పిటిషన్  ను కొట్టేయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ వివాదంలోకి పొలిటికల్ లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచాయి. చట్టం అందరికీ సమానమేనని, తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ చెబుతోంది.

 అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్ప్రతికి తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బన్నీ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు స్పందిస్తూ.. ‘జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం.’ అని ట్వీట్లు చేశారు.

 అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బన్నీ అరెస్టును తప్పు పట్టాడు  ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అల్లు అర్జున్‌కి గౌరవం ఇవ్వాలి. నేరస్తుడిగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు.’ అని పేర్కొన్నారు. ‘భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన నటుడి గౌరవం ఇవ్వాలి. సంధ్య టాకీస్ వద్ద జనాలను కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ’అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశాడు.  

ALSO READ : Allu Arjun case : చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్..

రాజకీయ నాయకులు ఒక న్యాయం.. నటులకు ఒక న్యాయమా..? బన్నీ అరెస్టు అన్యాయమని, ఈ విషయమై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని కేఏ పాల్ అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోతే , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు.  వైసీపీ నాయకులు రాలు లక్ష్మీపార్వతి కూడా ఈ అంశంపై స్పందించారు. ఇది చంద్రబాబు నాయడు కుట్ర అని పేర్కొన్నారు.