కొత్త సంవత్సరం (2025) వేళ తెలుగు సినిమాల హంగామా మొదలైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ తమ సినిమాల పోస్టర్స్ తేలి చేసి అప్డేట్స్ ఇచ్చారు. మరి ఆ సినిమాలేంటీ? వాటి అప్డేట్స్ ఏంటనేది చూసేద్దాం.
హరి హర వీరమల్లు:
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుండి మొదటి సింగిల్ జనవరి 6, 2025న ఉదయం 9:06 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే, ఈ పాటని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారు. పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి స్వరపరిచారు.
2025 just got POWER-packed! ⚔️ ?
— Hari Hara Veera Mallu (@HHVMFilm) December 31, 2024
Let's Celebrate this New Year with the first single from #HariHaraVeeraMallu ~ Full song out on Jan 6th at 9:06AM?#MaataVinaali In #Telugu ~ Sung by the one and only, POWERSTAR ? @PawanKalyan garu ??
A @mmkeeravaani Musical ? pic.twitter.com/8YDV7FcYUh
Also Read : న్యూఇయర్ వేళ.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్
డాకు మహారాజ్:
బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్స్ లోకి రానుంది. మేకర్స్ న్యూ ఇయర్ విషెష్ చెబుతూ బాలకృష్ణ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
??? ?? ?????? is all set to STORM in with unmatched MASS FORCE this Sankranthi.??
— Sithara Entertainments (@SitharaEnts) December 31, 2024
Team #DaakuMaharaaj wishes you all a very Happy New Year. ?
Grand Release WORLDWIDE at theatres near you on JAN 12th, 2025. ??#NandamuriBalakrishna @thedeol @dirbobby… pic.twitter.com/q0IIap0wwI
హిట్ 3 : ది థర్డ్ కేస్:
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్ర సీక్వెల్స్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో హిట్ 3 : ది థర్డ్ కేస్ ని తెరకెక్కిస్తున్నాడు. న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని సీరియస్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. ఈ మూవీ 2025 మే 1న రిలీజ్ కానుంది. ఇదివరకే టీజర్ విడుదల కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Happy new year.
— Nani (@NameisNani) December 31, 2024
2025. pic.twitter.com/CDLQ6DgieO
ఇడ్లీ కడై:
ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు దర్శకుడిగానూ బిజీ అవుతున్నాడు ధనుష్. రీసెంట్‌గా ‘రాయన్’చిత్రాన్ని డైరెక్ట్ చేసి, హీరోగానూ సక్సెస్ అందుకున్న ధనుష్.. మరో సినిమాలో కూడా లీడ్‌గా చేస్తూనే, దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించాడు.
Idly kadai First look Tom 5pm pic.twitter.com/iWgUiFMnrq
— Dhanush (@dhanushkraja) December 31, 2024
ఇప్పటికే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు.‘ఇడ్లీ కడై’ టైటిల్‌తో రూపొందించనున్నట్టు ప్రకటించారు. ఇపుడు న్యూ ఇయర్ స్పెషల్ గా ధనుష్ సాదాసీదాగా కనిపిస్తూ ఓ చేతిలో సంచి, మరో చేతిలో టిఫిన్ బాక్సులు పట్టుకుని వెళుతున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.