Biggest Flop Movies: 2024@లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన తెలుగు సినిమాలివే.. లిస్టులో మీ హీరో ఉన్నాడా?

మన సౌత్ ఇండస్ట్రీ.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంది. అలాంటి సౌత్ ఇండస్ట్రీలో ఈ ఏడాది (2024) టాలీవుడ్ సినిమాల హవా రికార్డుల వేటలో ముందంజలో ఉంది. అయితే, అందులో కొన్ని దారుణమైన సినిమాలు కూడా ఉన్నాయి. అంచనాలు ఉండి.. ఆవిరైన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాల గురించి ఓ లుక్కేద్దాం.. 

2024 ఇయర్లో చూసుకుంటే.. హనుమాన్, కల్కి 2898AD, పుష్ప 2, సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో  గొప్ప విజయాలు సాధించాయి. అయితే మరో పక్క ఇదే ఇయర్లో భారీ డిజాస్టర్లతో నిర్మాతలకి, డిస్టిబ్యూటర్స్ కి కన్నీళ్లు తెప్పించిన సినిమాలు కూడా ఉన్నాయి.. 

టాప్ 5 డిజాస్టర్ సినిమాలు

1. మిస్టర్ బచ్చన్ 

హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ ఎంత పెద్ద ప్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. రవితేజ కెరీర్లోనే భారీ బడ్జెట్లో తెరకెక్కింది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమా మొత్తం స్లో నరేషన్ అండ్ రన్ టైమ్ ఎక్కువ అవ్వడం.. రైడ్ లో మజా లేకపోవడం, గ్లామర్ డోస్ ఎక్కువ అవ్వడం..ఇలా పలు కారణాలతో భారీ డిసాస్టర్ గా నిలిచింది.ఈ చిత్రంలో రవితేజకి జోడిగా భాగ్యశ్రీ బోర్సె నటించింది 

ALSO READ | OG Special Song: సెంటరాఫ్ ఎట్రాక్షన్గా గ్లామర్ బ్యూటీ.. ఓజీ స్పెషల్ సాంగ్లో ఛాన్స్!

ఈ మూవీని పీపుల్ మీడియా బ్యానర్ లో TG విశ్వ ప్రసాద్ రూ.70 కోట్ల బడ్జెట్లో తెరెకెక్కించారు. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.14 కోట్ల వరుకు వచ్చినట్టు సమాచారం. సుమారు రూ.50 కోట్ల మేర భారీ నష్టాలతో ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిసాస్టర్ లిస్ట్లో చేరింది. 

2. డబుల్ ఇస్మార్ట్ 

2019 లో పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అప్పటి వరకు చాక్లెట్ బాయ్ ల ఉన్న రామ్ ని ఊర మాస్ గా చూపించి మంచి హిట్ అందుకున్నారు. రామ్ కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ మూవీ. మామూలుగానే హిట్ సినిమాలకి సిక్వెల్ అంటే ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉంటాయి. 

భారీ అంచనాల మధ్య రిలీజైన డబుల్ ఇస్మార్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర చతికలపడింది. విపరీతమైన పోటిలో రిలీజైన ఈ సినిమాకి మొదటి షో నుంచే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. స్టోరీలో కొత్తదనం ఏమి లేకపోవడం, స్లో నరేషన్, విలన్ క్యారెక్టర్ ని జోకర్ ల తయారు అవ్వడంతో ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. 

ఈ మూవీని పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్లో రూ.90 కోట్ల భారీ బడ్జెట్ లో తెరెకెక్కించారు. అయితే, మొత్తానికి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.18 కోట్ల వరకు మాత్రమే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో రూ.2.60 కోట్ల గ్రాస్‌ను సంపాదించి, ప్రపంచవ్యాప్తంగా రూ.20.53 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే.. సుమారు రూ.70 కోట్ల మేర భారీ నష్టాలు వచ్చాయి. 

3. ఫ్యామిలీ స్టార్ 

హీరో విజయ్ దేవర కొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం ఎవరికి సాధ్యం కానీ రీతిలో చరిత్ర సృష్టించింది. రూ.100 కోట్ల గ్రాస్ కొట్టి ఆ ఇయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మంచి అంచనాలతో రిలీజైన మూవీ  ఫ్యామిలీ స్టార్. అంచనాలకు తగ్గట్లే భారీ ప్లాప్ కూడా అయింది. ఫస్ట్ వీక్ వరకు కలెక్షన్స్ బాగానే వచ్చిన నెగిటివ్ టాక్ భారీగా స్పెర్డ్ అవ్వడంతో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తీసుకురాలేక పోయింది. 

ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్ రాజు రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా..వరల్డ్ వైడ్ గా రూ.23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి రూ.30 కోట్ల మేర నష్టాలు మిగిల్చింది. 

4. మట్కా 

డైరెక్టర్ కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ మట్కా. టీజర్ అండ్ ట్రైలర్ ఆసక్తిగా ఉండటంతో మంచి అంచనాలు ఎర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసారు. అయితే భారీ హైప్ తో రిలీజైన మట్కా మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో పూర్తిగా తేలిపోయింది, కొత్తదనం లేని కధ, నాసిరికమైన స్క్రీన్ ప్లే, ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టింది. 

ఈ మూవీ రూ.50 కోట్ల బడ్జెట్తో తీయగా రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో ఈ ఇయర్ లోనే అత్యంత భారీ డిసాస్టర్ అయింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి భారీ నష్టాలు మిగిల్చింది.

5.సైంధవ్ 

విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన మాస్ యక్షన్ ఎంటర్ ట్రైనర్ సైంధవ్. అప్పటి వరకు ఫ్యామిలీ అండ్ కామెడీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్న వెంకటేష్.. హిట్ సిరీస్ తో వరుస విజయాలు అందుకున్న శైలేష్ కొలనుతో జట్టు కట్టాడు. మంచి క్రైమ్ స్టోరీ, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ కలగలిపి సైంధవ్ సినిమాని తెరక్కించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో ఆసక్తి రేపిన సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజైంది. ఇందులో యాక్షన్ డోస్ ఎక్కవ్వడం, గజీబజీ స్క్రీన్ ప్లే, ఆర్ధం కాని నరేషన్ తో ప్లాప్ టాక్ మూట కట్టుకుంది. 

ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. రూ.25 కోట్ల వరుకు గ్రాస్ కలెక్షన్స్ కల్లెక్ట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల వరుకు నష్టాలు చవిచూసిందని ట్రేడ్ వర్గాల టాక్. అయితే, ఈ సినిమాలే కాకుండా ఈగల్, యాత్ర 2, ఆపరేషన్ వాలెంటైన్, గం గం గణేశ, లవ్ మీ ఇలా చాలానే ఉన్నాయి.