సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా ముంబైలోని మిరా రోడ్డులోని ఓ హోటల్ లో డ్రగ్స్ తీసుకుంటుండగా టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. శనివారం రాత్రి ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో నటితో పాటు డ్రగ్ పెడ్లర్ చాంద్ మోహమ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. దాడుల్లో 400 గ్రాముల డ్రగ్స్ స్వాధీనంచేసుకున్నారు. డ్రగ్ సప్లయర్ సాయిద్ పరారయ్యాడు. దీని విలువ దాదాపు 10లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఆ టాలీవుడ్ నటిని, చాంద్ ను విచారిస్తున్నారు పోలీసులు. అయతే ఎవరనేది వివరాలు తెలియాల్సి ఉంది.
