టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో భారత్‌కు బంగారు పతకం దక్కింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు బ్యాడ్మింటన్‌లో తొలి బంగారు పతకం కావడం ఇదే మొదటిసారి. కొద్దిసేపటి క్రితం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచులో ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్ 21-14 21-17 తేడాతో ప్రపంచ నంబర్ టూ ర్యాంక్ ఆటగాడు ర్యాంకర్, గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియెల్ బెథెల్‌పై విజయం సాధించి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా వచ్చిన ఈ స్వర్ణం పతకంతో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 16కు చేరగా.. వీటిలో నాలుగు బంగారు, ఏడు రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.
