హైదరాబాద్లో ఇయ్యాల ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గవర్నమెంట్​టీచర్లతో సీఎం రేవంత్​రెడ్డి ఇంటరాక్షన్ నేపథ్యంలో శుక్రవారం బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అడిషనల్ సీపీ విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం వెహికల్స్​కు అనుమతి లేదు.

నాంపల్లి మీదుగా వెహికల్స్ ను డైవర్ట్ చేస్తారు. బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఏఆర్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వచ్చే వెహికల్స్ ను అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా మళ్లిస్తారు. సుజాత స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేన్ నుంచి ఖాన్ లతీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా డైవర్ట్ చేస్తారు.