మేడారంలో ఈరోజు సమ్మక్క సారలమ్మ దేవతలకు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. కన్నెపల్లిలో సారలమ్మకు, మేడారంలో సమ్మక్క దేవతకు అలాగే గంగారం మండలంలో పగిడిద్ద రాజుకు తిరుగు వారం పూజలు నిర్వహిస్తారు. పూజా మందిరాల్లో శుద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. అమ్మవార్లకు ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తారు. పూజారులంతా మొక్కులు తీర్చుకొని రాత్రి సమయంలో తిరుగువారం పండుగ ముగిస్తారు. దీంతో మహా జాతరకు సంబంధించిన చివరి పూజలు ఈ రోజుతో ముగుస్తాయి.
