
మేషం : కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ప్రత్యేక గుర్తింపు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. సమాజంలో పలుకుబడి. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. వ్యాపారులు సంస్థల వికేంద్రీకరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. క్రీడాకారులకు ఊహించని పురస్కారాలు.
వృషభం : రాబడి పెరుగుదలతో ఊరట. ఊహించని ఆహ్వానాలు. విద్యార్థులకు విద్యావకాశాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అంచనాలు నిజమయ్యే సమయం. ఉద్యోగులకు సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. కళాకారుల చిక్కులు వీడతాయి.
మిథునం : ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వివాదాలను నేర్పుగా అధిగమిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారులు ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.
కర్కాటకం : ఆదాయం ఊహించిన విధంగా ఉంటుంది. అందరిలోనూ మీమాటే చెల్లుబాటు కాగలదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఉద్యోగులు ముఖ్య సమాచారం వింటారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు.
సింహం : ముఖ్యమైన కార్యాలు శ్రమానంతరం పూర్తి. ఆదాయం సంతృప్తికరం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కొన్ని ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, గృహం కొంటారు. సోదరులతో ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. రాజకీయవేత్తలకు విదేశీయానం. వైద్యులు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది.
కన్యా : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖుల పరిచయాలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధి నిర్వహణలో గుర్తింపు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు సత్తా చాటుకుంటారు. కళాకారులు ఇబ్బందులు అధిగమిస్తారు.
తుల : దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న కార్యాలలో ముందడుగు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగులకు బాధ్యతలలో భారం తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. క్రీడాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం.
వృశ్చికం : అదనపు రాబడి. నిరుద్యోగులకు శుభవార్తలు. అప్రయత్న కార్యసిద్ధి. కొత్త వాహనాలు కొంటారు. విద్యార్థులు లక్ష్యం సాధిస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారులకు లాభాలతో పాటు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం, విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగుతాయి. క్రీడాకారులు, కళాకారుల కలలు ఫలిస్తాయి.
ధనుస్సు : రావలసిన సొమ్ము అందుతుంది. కార్యక్రమాల్లో విజయం. విద్యార్థుల ఊహలు నిజమవుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. కష్టం ఫలిస్తుంది. వ్యాపారులు సంస్థలు విస్తరిస్తారు. ఉద్యోగులకు బాధ్యతలపై దృష్టి. కళాకారులకు పురస్కారాలు. పరిశోధకులు, వైద్యరంగం వారి సేవలు విస్తృతమవుతాయి.
మకరం : రాబడి మెరుగ్గా ఉంటుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. భూములు సమకూర్చుకుంటారు. విదేశీ విద్యావకాశాలు. ప్రముఖులు పరిచయమై మాటసాయం అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలులో సమస్యలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు లక్ష్యసాధనలో సఫలం. కళాకారులకు వివాదాల పరిష్కారం.
కుంభం : కొన్నివిలువైన వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులకు అనుకున్న విద్యావకాశాలు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో విశేష గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు పదవీయోగం. కళాకారులు, క్రీడాకారులు సత్తా నిరూపించుకుంటారు.
మీనం : కొన్ని నిర్ణయాలు వాయిదా. ఇంటి నిర్మాణాలలో కొంత జాప్యం. ఆదాయం తగ్గి కొత్త అప్పులు చేస్తారు. ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు పనిభారంతో ఉక్కిరిబిక్కిరి. కళాకారులకు నిరుత్సాహం. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు కొన్ని ఇబ్బందులు పడతారు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సోదరులను కలుసుకుంటారు.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400