తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం అమరావతిలో పర్యటిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ముఖ్యమైన నేతలకు విందు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తనకు సహకరించినందుకు ఆయన విందు ఏర్పాటు చేశారు. మంగళవారం ఏపీ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తిరుపతి చేరుకుంటారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని 24న విజయవాడ వెళ్తారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తారు.
