Today Releases Movies: నేడు (Dec 20న) థియేటర్లలోకి 4 సినిమాలు.. తెలుగు ప్రేక్షకులకి పండగే

సినీ ప్రేక్షకులకు ఈ డిసెంబర్ నెల అంత పుష్పగాడి రూల్ తోనే సాగుతూ వచ్చింది. నేటి వరకు పాన్ ఇండియా భాషల్లోను ఈ ఒక్క సినిమానే నడుస్తోంది. దీంతో  గత రెండు వారాలుగా కొత్త సినిమాల కోసం ఆడియన్స్ థియటర్స్ వైపే చూడాల్సిన గ్యాప్ వచ్చింది. ఇక వారందరికీ తెలుగు సినిమాలు మంచి జోష్ ఇవ్వనున్నాయి. ఇవాళ శుక్రవారం (డిసెంబర్ 20న) థియేటర్స్ లో 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథేంటీ? అన్నది ఓ సారి లుక్కేసి.. చూసేయండి. 

బచ్చల మల్లి (Bachchala Malli):

హీరో అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విలేజ్ డ్రామాగా నైంటీస్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది తండ్రి, కొడుకుల మధ్య నడిచే గొడవ నేపథ్యంలో సాగే కథ. తండ్రి తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో 15 సంవత్సరాలు ఉన్న కుర్రాడు అంత మూర్ఖుడిగా ఎలా మారిపోతాడు అనే చూపించాడు డైరెక్టర్. ఎమోషన్స్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతోంది.

‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2):

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో జాతీయ అవార్డు విన్నర్ వెట్రిమారన్ (Vetrimaran) డైరెక్ట్ చేస్తున్న ‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2) ఒకటి. సూరి మరో లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌ చేస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఇవాళ డిసెంబర్ 20న రిలీజయింది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో క్రిస్మస్ కానుకగా అలరించనుంది.‘అహంకారంతో పాలకులు అణచివేసిన సామాన్యుల నుంచి పుట్టుకొచ్చిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’.

‘ముఫాసా: ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’(Mufasa The Lion King):

‘ముఫాసా: ది లయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’(Mufasa The Lion King) ఇవాళ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20న ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ థియేటర్లలో వచ్చింది. ఈ సినిమా ఎక్కువగా 3D థియేటర్స్ లో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీనికి దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ముఫాసా తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. దాంతో ఈ ప్రీక్వెల్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 

వరల్డ్ ఆఫ్ UI:

విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర(Upendra) దాదాపు ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన దర్శకుడిగా తీస్తున్న మూవీ UI (UI The Movie). గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ -19, ద్రవ్యోల్బణం, AI, నిరుద్యోగం, ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్..లాంటి విభిన్న కథలతో డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర..ఇపుడు వరల్డ్ ఆఫ్ UI తో నేడు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20న థియేటర్స్ లోకి వచ్చేసాడు.