హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ రాసిన ‘‘షేరింగ్ ఆఫ్ కృష్ణా వాటర్– పోతిరెడ్డిపాడు ఇష్యూ’’ పుస్తకాన్ని శుక్రవారం రిలీజ్ చేస్తారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫీసులో నిర్వహించే ఈ కార్యక్రమానికి హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సీఎం రిటైర్డ్ ఓఎస్డీ ఎన్. రంగారెడ్డి బుక్ రివ్యూ చేస్తారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ నేత జానారెడ్డి, టీజేఎస్ చీఫ్ కోదండరామ్, సుప్రీం కోర్టు అడ్వొకేట్ నిరూప్‌రెడ్డి, రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజనీర్లు, యూఎస్‌ఏ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధులు, ప్రజాసంఘాల లీడర్లు పాల్గొంటారు.
