దీదీ.. నీ గేమ్ ఓవర్

దీదీ.. నీ గేమ్ ఓవర్

న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పనైపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్‌‌లోని పురులియాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తొలుత లెఫ్ట్ ప్రభుత్వం ఆ తర్వాత టీఎంసీ సర్కార్ బెంగాల్‌‌లో ఇండస్ట్రీలను డెవలప్ కానివ్వలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దీదీ ఖేల్ ఖతమ్ అన్నారు.  ‘ఇరిగేషన్ విషయంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలు తీసుకోలేదు. రైతులను తృణమూల్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఇక్కడ తృణమూల్ తుడిచి పెట్టుకుపోతుంది. దీదీ తన చికాకునంతా నాపై చూపిస్తున్నారు. కానీ మేం ఆమెను సోదరిలా చూస్తాం. భారత్‌లోని మిగతా సోదరీమణుల్లాగే ఆమెను చూస్తాం. గౌరవించడం అనేది మన సంస్కృతిలో భాగమనేది మర్చిపోవద్దు’ అని మోడీ చెప్పారు.