317 జీవోతో నష్టపోయిన ఉద్యోగులకు త్వరలోనే న్యాయం

  • టీఎన్జీవో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం లభిస్తుందని టీఎన్జీవో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోల జనరల్‌‌బాడీ మీటింగ్‌‌కు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు.

 పెండింగ్‌‌ డీఏలతోపాటు, బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా కేంద్ర సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు జావేదన,  కార్యదర్శి రవి, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్‌‌, సత్యనారాయణ గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, పి.వెంకటరెడ్డి, జి.శ్రీనివాస్, నిర్మల రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.