చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం బూస్టర్ డోస్ వేసుకున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆయన ఇక్కడి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా ఉండటం వల్లే తాను వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్లు కచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకొని దేశంతో పాటు మనల్ని మనం కాపాడుకోవాలని స్టాలిన్ పేర్కొన్నారు.
