బెంగాల్ గవర్నర్ ధన్కర్‌‌ను తొలగించండి

బెంగాల్ గవర్నర్ ధన్కర్‌‌ను తొలగించండి
కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్‌‌ను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌‌ను తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కలసి మెమొరాండం అందజేశారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడటంలో, సంరక్షించడంలో గవర్నర్ ఘోరంగా విఫలమయ్యారు. అలాగే సుప్రీం కోర్టు చట్టాలను పదేపదే ఉల్లంఘించారు’ అని ఆ మెమొరాండంలో పేర్కొన్నారు. సుఖేందుతోపాటు ఎంపీలు సుదీప్ బంధోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రెయిన్, కల్యాణ్ బెనర్జీ, కాకొలి ఘోష్ దస్తిదర్‌‌లు మెమొరాండంపై సంతకాలు చేశారు.