తిరుమల తరుపతి పుణ్యక్షేత్రాన్ని అత్యంత పరిశుభ్ర ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపట్టారు టీటీడీ ఆలయాధికారులు. సంక్రాంతి తర్వాత తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ సీసాల వినియోగానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తిరుమల వ్యాప్తంగా మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తిరుమలలో నీటికొరత ఇబ్బంది లేదని… మరో రెండేళ్లకు సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

