పుట్టుకతో పిల్లలకు భాష ఎలా నేర్పిస్తామో..వ్యవసాయం, రైతు గురించి చెప్పాలి

పుట్టుకతో పిల్లలకు భాష ఎలా నేర్పిస్తామో..వ్యవసాయం, రైతు గురించి చెప్పాలి

పిల్లలకు పుట్టుకతో భాష ఎలా నేర్పిస్తామో..వ్యవసాయం, రైతు గురించి చెప్పాలని అన్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి.

లాక్ డౌన్ విధుల్లో భాగంగా జిల్లాల్లో పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పేడు – వెంకటగిరి జాతీయ రహదారి మార్గంలో వరి నాటుతున్న రైతులు, కూలీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోటి వారితో కలిసి వరి నాటారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని అన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసినా తాను ఒక రైతు బిడ్డనేనని అన్నారు. ఇంత క్లిష్టపరిస్థితుల్లో మనం అన్నం తింటున్నామంటే దానికి రైతే కారణమని ప్రశంసల వర్షం కురిపించారు.  ప్రపంచమంతా కరోనా తో భయపడుతుంటే ..చెదరని చిరునవ్వుతో రైతు వ్యవసాయం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  వారికి నా జోజార్లు.

వ్యవసాయం అనేది ఎవరో చదువురానివారు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారు చేసే పని అని అనుకుంటున్నారు, అదికాదు. మంచి ఆహారం – మంచి ఆరోగ్యోం – మంచి దేశం అనే ధ్యేయంతో మనమందరం వారికి మద్దతు ఇవ్వాలి.

స్థాయితో సంబంధం లేకుండా అందరం మంచి ఆహారం తింటున్నాం. మనలో సహాయం చేసే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఉద్యోగం చేస్తే వారంతపు రోజుల్లో వ్యవసాయం చేయమని కోరుతున్నా. సిటీల్లో ఉండే ప్రజలు వాళ్ల కు సమీప గ్రామ రైతుల యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.