తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీనివాసన్ తన కుటుంబంతో కలిసి కోయంబత్తూరు నుంచి తిరుమలకు హెలీకాప్టర్ ద్వారా బయలు దేరారు. అయితే వాతావరణం బాగు లేకపోవడంతో హెలికాఫ్టర్… చిత్తూరు జిల్లా తిరుపత్తూరు-కుప్పం సరిహద్దుల్లోని నంగ్లి గ్రామ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాతావరణం అనుకూలించడంతో హెలీకాప్టర్ తిరుపతికి బయలుదేరింది. హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లతో సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పొలాల్లో దిగిన హెలీకాప్టర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు
