తిరుమల టూర్​.. ఈ తీర్థ క్షేత్రాలను తప్పక చూడండి...

కష్టాలు తీర్చే కొండబరాయుడు కొలువైన శేషాచల కొండల్లో ఇరవై ఆరు కోట్ల విద్య తీర్థాలున్నట్లు వెంకటాచల మహత్యం లో ఉంది. తీర్థం అంటే పావన జలం అని అర్ధం. శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండల్లో దాగిన తీర్థాల గురించి వరాహ, రామన, పద్మ, మార్కండేయ, స్కంద, ఆదిత్య, బ్రహ్మాండ, భవిష్యోత్తర, గరుడ పురాణాలు వివరిస్తున్నాయి. అన్ని కాలాల్లోనూ పర్వని ప్రకృతిలో, ఇంకాల పారే సెలయేళ్లతో కనిపిచే ఈ పుణ్యతీర్థాలు దర్శించుకున్నా, ఇక్కడ పుణ్యస్నానమాచరించినా ముక్తి కలుగుతుందని భవుల విశ్వాసం, బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు వీటిని చూడచ్చు.

చుట్టూ గుండ్రవి, ఎత్తైన రాతి కొండలు. మధ్యలో రాతిబండ. పైనుంచి చూస్తే రాతి కుండలా కనిపిస్తుంది.  తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిక్కులో ఉంది. పాపవినాశనం డ్యాం మీదుగా పశ్చిమ దిక్కులోని అడవిలో ఏడు కిలోమీటర్లు నడిస్తే ఈ తీర్థాన్ని చేరుకోవచ్చు. ముక్తిమార్గాన్ని ఇచ్చే సప్తతీర్థాల్లో ఇది ఒకటి. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు నశించి మోక్షమార్గం సిద్ధిస్తుంది. ఈ దారిలో సైకస్, శతావధి మొక్కలు కనిపిస్తాయి. వీటితోపాటు అరుదైన మగసిరిగడ్డలు కనిపిస్తాయి. పసుపురాతి, కడప బండలు దాటితే ఈ జలపాతం కనిపిస్తుంది.

ALSO READ | తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి తొలి నైవేద్యంగా దోసెలు, వడలు..!

ఆకాశగంగ : తిరుమల నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది,  ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవికి వెంకటేశ్వరస్వామికి పెళ్లి చేసే టైంలో గంగను స్మరించి కన్యాదానం చేశారని స్కంద పురాణంలో ఉంది. అప్పుడు గంగ భూమిపైకి వచ్చిందట.  అలా ఆకాశరాజు గంగను రప్పించడంవలన  ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ తీర్థానికి ఆర్టీసీ, ప్రైవేట్​ వెహికల్సో వెళ్లవచ్చు.

జపాలి: ఆకాశగంగ తీర్థం దగ్గరలోనే ఉంది.  పూర్వం ఇక్కడ జపాలి మహర్షి దీక్ష చేశాడు. ఆ దీక్షకు మెచ్చి ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిశారని స్థల పురాణం చెప్తుందిన  ఆలయానికి తూర్పున శ్రీరామ తీర్థం.. పడమర సీతమ్మ తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు పంచ మహాపాతకాలు తొలగిపోతాయట.  ఇక్కడికి వెళ్లాలంటే కిలోమీటరు వరకు నడవాలి. 

పాపవినాశనం: తిరుమల ఆలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్నానమాచరిస్తే పాపాలు పోయి కోరికలు నెరవేరతాయని అంటుంటారు,  అందుకే పాపవినాశనం అని పేరొచ్చింది.  పూర్వం ఆ తీర్థంలో  జలధాక ఉధృతంగా ఉండేది.  తిరుమలలో నీటి అవసరాల కోసం 1983 లో ఇక్కడ డ్యాం కట్టారు.  దాంతో వాటర్​ స్టోరేజ్​ వల్ల ఈ తీర్థానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.  కాని ఆ లోటు తీర్చేందుకు దేవస్థానం ఆర్టీఫిషియల్​ గా మరో తీర్థం కట్టించింది.  ఇక్కడ గంగా భవానీ... ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి.

సనకసనందన: పాపవినాశనం డ్యామ్​ మీదుగా గుట్ట ఎక్కి కిలో మీటరు నడిస్తే ఈ తీర్థం కనిపిస్తుంది,  సనకసనందాది యోగులు ఇక్కడ తపస్సు చేసి వైకుంఠప్రాప్తి పొందారు.  అందువల్ల ఇది సవకసనందన తీర్థంగా పిలవబడుతోంది.  ఈ తీర్థం మీదుగానే రామకృష్ణ తీర్థం, తుంబురు తీర్థం, తాంత్రికలోయ తీర్థాలకు వెళ్లాలి. 

చక్ర తీర్థం: శిలాతోరణానికి ఉత్తరం దిక్కున కొండల మధ్య చక్రతీర్థం ఉంది.  ఇక్కడ చక్రతాళ్వార్​ ( సుదర్శన చక్రం) శిలారూపంలో రాతిబండపై ఉంటుంది. వేంకటేశ్వరస్వాబి శిలావతార సమయంలో చక్రతాళ్వార్​ ఈ  తీర్థంలో స్నానమాచరించి శ్రీవారిని అలంకరించినందువల్ల దీనికి చక్రతీర్థం అని పేరొచ్చింది. ఇక్కడ స్నానం చేస్తే భూత, రాక్షస బాధలు తొలగిపోతాయట. 

తుంబురు: తిరుమలకు 11 కిలోమీటర్ల దూరంలో  ఉంది. శేషాచలంలో వెలిసిన తీర్థాల్లో ఇది చాలా ప్రత్యేకమైనది.  తుంబురుడు అనే గంధర్వుడు ఇక్కడ స్నానం చేసి విష్ణులోకం వెళ్లాడు,  అందుకే ఈ తీర్థాన్ని తుంబరురు కోన తీర్థమని పిలుస్తుంటారు,  ఇక్కడి ప్రకృతి భక్తులను పరవశింప చేస్తుంది,  కొండ రెండుగా చీలినట్లు ఉంటుంది.

గోగర్భ: త్రేతాయుగంలో పాండవులు ఆది వరాహస్వామిని దర్శించడానికి  గోగర్భ తీర్థం దగ్గరే యఙ్ఞ యాగాదులు చేశారట.  ఈ విషయాన్ని అక్కడి రాళ్లపై చెక్కిన బొమ్మలు తెలుపుతున్నాయి.  అందుకే దీనిని పాండవ తీర్థమని పిలుస్తారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్థానికి రోడ్డుమార్గం ఉంది.  ఆర్టీసీ, ప్రైవేట్​ వెహికల్స్​లో ఇక్కడికి వెళ్లవచ్చు.

రామకృష్ణ: రామకృష్ణ తీర్థం ఆలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది,  తిరుమల క్షేత్రంలో చాలా ముఖ్యమైనది.  పూర్వం వెంకటాద్రిలో రామకృష్ణుడనే మహర్షి కఠోర తపస్సుతో స్వామి కృపను పొందాడట. అందుకే దీనిపేరు రామకృష్ణ తీర్థంగా సార్ధకమైంది,  ఈ తీర్థంలో భక్తి శ్రద్దలతో స్నానమాచరిస్తే భక్తులకు అనంత పుణ్యఫలాలు సిద్ధిస్తాయట.

- వెలుగు, లైఫ్​‌‌–