తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. చాలా రోజుల తరువాత స్వామివారి రోజువారీ ఆదాయం రూ.5కోట్లకు చేరుకుంది. 2024 ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రోజున తిరుమల హుండీకి రూ.5 .09 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవాస్థానం వెల్లడించింది. తిరుమలకు దేవస్థానానికి రూ. 5 కోట్ల ఆదాయం రావడం ఈ నెలలో రెండోసారి కావడం విశేషం.
ఇక స్వామి వారిని 76 వేల 577 మంది భక్తులు దర్శించుకోగా 23 వేల 656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మరోవైపు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్ లో సమావేశం కానున్న పాలకమండలి సభ్యులు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
Also Read :భధ్రాద్రి రామాలయంలో నూతన ఆర్జిత సేవ షురూ