టీటీడీ కీలక నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు

ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.  శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులును పదవి నుండి తొలగించింది. ఇటీవల సీఎం, టీటీడీ యాజమాన్యం, అధికారులు, అర్చకులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై  మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.  

రమణ దీక్షితులును తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించిందని..  టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన సంగతి తెలిసిందే.