అల్పపీడనం ఎఫెక్ట్ తో.. తిరుమలలో భారీ వర్షం..      

బంగాళా ఖాతతంలో ఏర్పడిన అల్పపీడనంతో తిరుమల శ్రీవారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు,  తిరుమలలో భారీ వర్షం ( నవంబర్​ 13 ఉదయం 10 గంటల సమయంలో).... ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.   దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు  రోజుల పాటు వర్షాలు  ( నవంబర్ 13 నుంచి ) ​ కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.   తిరుమలలో వర్షం కురుస్తోంది. వర్షపు జల్లుల్లో తడుస్తూ భక్తులు మురిసిపోతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది. రాత్రంతా మంచు కురుస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, SSD టైమ్ స్లాట్ టోకన్ దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టిటిడి వెల్లడించింది. మరోవైపు నిన్న (మంగళవారం) 61 వేల 446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21వేల 374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక  స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు...