తిరుమల బ్యాంక్ సేవలు అభినందనీయం

  •     అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 

మలక్ పేట, వెలుగు: తిరుమల బ్యాంకు ఖాతాదారులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం మలక్ పేటలో 2025  క్యాలెండర్,  డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఖాతాదారులకు నమ్మకాన్ని కల్పించడం ద్వారానే బ్యాంకులు   మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు. వినియోగదారుల కోసం మెరుగైన బ్యాంకింగ్ సేవలు భవిష్యత్తులో అందించాలని కోరారు.  

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలను కల్పిస్తుందన్నారు.  బ్యాంకు చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ..  ఖాతాదారులకు నమ్మకమైన సేవలను అందిస్తూ అభివృద్ధిలో ముందు ఉందన్నారు.   

త్వరలోనే  సంతోష్‌ నగర్‌‌లో  మరో బ్రాంచ్‌ని ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, శ్రీనివాస్ స్వామీజీ, జీఎం శోభానాద్రి, శర్మ, బ్యాంకు ఇన్ చార్జి రవిశంకర్, బ్యాంకు డైరెక్టర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.