తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు( 75 ) కరోనా తో మరణించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో 30 ఏళ్లుగా పైగా సేవలందించిన శ్రీనివాస దీక్షితులకు ఇటీవల కరోనా సోకింది. అత్యవసర చికిత్స కోసం స్విమ్స్ లో జాయిన్ అయ్యారు. అయితే స్విమ్స్ లో చికిత్స పొందుతూ శ్రీనివాస దీక్షితులు మరణించారు.
కాగా మరో వైపు తిరుమలలో కరోనా కేసులు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. తిరుమల అర్చకులు , సిబ్బందితో సహా మొత్తం 158మంది కరోనా సోకినట్లు సమాచారం. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
