ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తిరత్ సింగ్ రావత్ ఎన్నికయ్యారు. గత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడంతో.. తిరత్ సింగ్ రావత్‌ను కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. తివేంద్ర సింగ్ రావత్ నాయకత్వంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో.. ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో నాయకత్వ మార్పులో భాగంగానే ముఖ్యమంత్రి మార్పు జరిగినట్లు తెలుస్తోంది. నూతన సీఎంగా ఎన్నికయిన తిరత్ సింగ్ రావత్ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరత్ సింగ్ ప్రస్తుతం ఎంపీగా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు.
