యాపిల్​ను కట్​చేస్తే రంగు మారుతుందా.. అయితే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి

యాపిల్​ ను  కోసినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే కొద్ది సేపటికే అది రంగు మారిపోతుంది. దీంతో వాటిని అతిథులకు పెట్టాలంటే చాలా ఇబ్బం దిగా అనిపిస్తుంది. ఆక్సిడేషన్ ప్రక్రియ వల్ల పండ్లు ఇలా రంగు మారిపోతాయి. మ‌రి కోసిన‌ యాపిల్ రంగుమార‌కుండా తాజాగానే ఉండాలంటే ఏంచేయాలో తెలుసుకుందాం..

యాపిల్‌ని క‌ట్‌చేసి పిల్లల‌కు స్నాక్స్‌గా ఇవ్వాల‌నుకునే త‌ల్లుల‌కు ఒక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. పిల్లలు స్కూల్లో వాటిని తినే లోపు అవి రంగు మారిపోయి చిరాకు క‌లిగించేలా త‌యార‌వుతాయి. దాంతో వారు తినేందుకు ఇష్టప‌డ‌రు. యాపిల్‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ముక్కలు కోసిన వెంట‌నే అందులోని క‌ణాలు పాడ‌వుతాయి. దాంతో గాల్లోని ఆక్సిజ‌న్‌, యాపి ల్లో ఉన్న ఐర‌న్‌తోనూ, పాలిఫెనాల్ అనే ఎంజైమ్‌తోనూ చ‌ర్య జ‌రిపి ఐర‌న్ ఆక్సైడ్ త‌యార‌వుతుంది. అందుకే యాపిల్ ముక్కలు బ్రౌన్ రంగులోకి మార‌తాయి. అయితే ఇలా రంగుమారిన‌ యాపిల్ ముక్కల‌ను తిన‌డం వ‌ల‌న ఎలాంటి హానీ జ‌ర‌గ‌దు కానీ చూసేందుకు మాత్రం కంటికి ఇంపుగా ఉండ‌వు. మరి రంగు మారకుండా ఉండాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి. .  .


చల్లని నీళ్లలో వేయండి.. కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలను ఐస్‌ నీళ్లలో కొన్ని నిమిషాల ఉంటి బయటకు తీయాలి. ఈ టిప్‌ ఫాలో అయితే.. యాపిల్‌ ముక్కలు కాసేపటి వరకు ఫ్రెష్‌గా ఉంటాయి.

జిప్‌లాక్‌ బ్యాగ్‌..కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు నల్లగా మారకుండా ఉండాలంటే.. జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి లాక్‌ చేయండి. ఈ బ్యాగ్‌ను వెంటనే ఫ్రిజ్‌లో పెట్టండి. దీంతో యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌.. గాలిలోని ఆక్సిజన్‌తో రియాక్ట్‌ అవ్వదు. మీకు కావలసినప్పుడు.. ముక్కలు తీసుకుని తినొచ్చు.

నిమ్మరసం..కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లండి. నిమ్మరసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ యాపిల్‌ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. వాటిని రంగు మారనివ్వదు.కప్పు నీటిలో టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపి ఆ మిశ్రమంలో యాపిల్‌ ముక్కల్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టినా కూడా ఆపిల్ ముక్కలు రంగు మారవు.

తేనె.. ఒక కప్పు మంచి నీటిలో, రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి మిక్స్‌ చేయండి. ఇప్పుడు ఈ నీటిలో, కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచండి. ఇలా చేస్తే.. యాపిల్‌ ముక్కలు ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటాయి.

ఉప్పు..ఒక బౌల్‌లో అర టీస్పూన్ ఉప్పు కలిపండి. అందులో కోసిన పండ్ల ముక్కలను వేయండి. రెండు నిమిషాలపాటు ఉంచి తీయండి. దీనివల్ల యాపిల్ ముక్కలు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.

దాల్చిన చెక్క..దాల్చిన చెక్క పొడిని కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలపై చల్లండి. ఇలా చేస్తే ముక్కలు బ్రౌన్‌ కలర్‌లోకి మారవు. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు.. నల్లగా మారకుండా రక్షిస్తాయి.

 అల్లం ద్రావణం: కట్ చేసిన పండ్లను అల్లం ద్రావణం (జింజర్ అలే)లో వేసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్ గా కనిపిస్తాయి. 

ఆస్కార్బిక్ ఆమ్లం: ఫుడ్ స్టోర్లలో దొరికే ఆస్కార్బిక్ ఆమ్లాన్ని నీటిలో కరిగించి, ఆ నీళ్లలో పండ్లను కాసేపు ఉంచాలి. ఇది కూడా ఆక్సిడేషన్ ప్రక్రియ ను అడ్డుకుంటుంది.

 తొక్క తీయకూడదు: కట్ చేసిన యాపిల్స్ ముక్కలను 10- నుంచి12 గంటల పాటు తాజాగా ఉంచాలనుకుంటే యాపిల్స్ తొక్క తీయకూడదు. కత్తిరించిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్ లో ప్యాక్ చేయాలి. యాపిల్ ముక్కలను ప్లాస్టిక్ ర్యాప్ లో చుట్టాలి.