మారిన ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్..నేటి నుంచి అమలు

మారిన ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్..నేటి నుంచి అమలు

డిసెంబర్ 1 నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్, శతాబ్ధి ఎక్స్ ప్రెస్ తో పాటు 14 ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ల టైమింగ్స్ మారుస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయించింది.

టైమింగ్స్ మారిన ట్రైన్ వివరాలు ఇలా ఉన్నాయి

  1. ట్రైన్ నెంబర్ 02951/ 02952 ముంబై సెంట్రల్ – న్యూఢిల్లీ రాజధాని స్పెషల్ ఎక్స్ ట్రైన్ ప్రతీరోజు ఉదయం 5.30నుంచి స్టేషన్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నేటి నుంచి అదే ట్రైన్ సాయంత్రం 5.30నుంచి ప్రారంభం కానుండగా..సాధారణంగా ఈ ట్రైన్ కి బోరివలి స్టేషన్ లో ఆగే సౌకర్యం లేదు. అయితే ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకొని ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి ట్రైన్ ప్రారంభమై బోరివలి , సూరత్, వడోదర, రాట్నం, కోటా మీదిగా తిరిగి మరోసటి రోజు ఉదయం 8.32కి ఢిల్లీకి తిరిగి రానుంది.
  2. ట్రైన్ నెంబర్ 02953/ 02954 ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి హజ్రాత్ నిజాముద్దీన్ ఆగస్ట్ క్రాంతీ ఎక్స్ ప్రెస్ 5:10 పీఎం నుంచి బయలు దేరనుంది.
  3. ట్రైన్ నెంబర్ 02009/02010  ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ శతాబ్ధి స్పెషల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వారానికి 6 రోజులు సర్వీసు అందుబాటులో ఉంది. ముంబై సెంట్రల్ నుంచి  ఉదయం 6.40కి బయలుదేరి మధ్యహ్నం 2: 40కి అహ్మదాబాద్ కు చేరుకోనుంది.
  4. ట్రైన్ నెంబర్ 02244/02243 ముంబైలోని బాంద్రా టెర్మినస్ నుంచి ఉదయం 5:10కి బయలుదేరి ఉదయం 7: 15కి కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకోనుంది.
  5. ట్రైన్ నెంబర్ 02248/02247 రాజస్థాన్ లోని శతాబ్ధికి చెందిన రైల్వే స్టేషన్ నుంచి గ్వాలియర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ వారానికి మూడురోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ శబర్మతి రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 4.50కి బయలుదేరనుండగా.. ప్రస్తుతం మారిన ఈ ఐదు ట్రైన్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి. మారిన మరికొన్ని ట్రైన్ సమయాలు మరికొద్ది సేపట్లో అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.