ఏపీలో ఆ పార్టీకే అధికారం.. టైమ్స్ నౌ ఈటీజీ

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గర పడింది. జూన్ 4న వెలువడే ఫలితాల దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరగటమే కాకుండా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఒక క్లారిటీ రాకపోవటంతో ఉత్కంఠ రెట్టింపయింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సగం సంస్థలు వైసీపీదే అధికారమని తేల్చగా, సగం సంస్థలు ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని తేల్చాయి. ఈ క్రమంలో తాజాగా వెల్లడైన టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ వైసీపీదే అధికారమని తేల్చింది.

అధికార వైసీపీ 117 నుండి 125 స్థానాల్లో గెలుపొంది రెండోసారి అధికారంలోకి రాబోతోందని తేల్చింది టైమ్స్ నౌ ఈటీజీ. వైసీపీకి 51శాతం మేర ఓట్లు దక్కుతాయని, టీడీపీ కూటమి 47శాతం ఓట్లతో 50 నుండి 58 స్థానాలతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది టైమ్స్ నౌ. ఈసరి ఎన్నికల్లో మహిళా ఓటింగ్ అధికంగా నమోదయ్యిందని, 2019 ఎన్నికల కంటే 15శాతం పెరిగిందని తెలిపింది. మెజారిటీ మహిళా ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలిపింది టైమ్స్ నౌ. ఇక లోక్ సభ స్థానాల విషయానికి వస్తే వైసీపీకి 13 నుండి 15స్థానాలు దక్కుతాయని, ఎన్డీయే కూటమికి 10 నుండి 12స్థానాలు దక్కుతాయని తెలిపింది.

Also Read:పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైసీపీ..