IND vs NZ: భయపెట్టిన రోహిత్ సేన.. కెప్టెన్సీకి సౌథీ రాజీనామా

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులో రోహిత్ సేన అద్భుత విజయం సాధించిన విషయం విదితమే. వర్షం కారణంగా మొదటి మూడు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినప్పటికీ.. చివరి రెండు రోజుల్లో మ్యాచ్ ముగిచింది. ఈ మ్యాచ్ ఫలితం న్యూజిలాండ్ క్రికెట్‌పై ప్రభావం చూపింది. సొంతగడ్డపై భారత జట్టు ఆట తీరు చూసి కివీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ సౌథీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 

ALSO READ | Pakistan Cricket: ఈ జట్టును నడిపించలేను.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన బాబర్ ఆజం

మరో వారం రోజుల్లో అనగా అక్టోబర్ 16 నుంచి భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో కెప్టెన్సీకి సౌథీ రాజీనామా చేయడం కివీస్ జట్టును కలవరపెడుతోంది. 2008లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేసిన ఈ పేసర్.. 102 టెస్టుల్లో 382 వికెట్లు తీసిన జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అలాంటి ప్లేయర్ భారత పర్యటనకు ముందు తప్పుకోవడం ఆ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

కాగా, సౌథీ తప్పుకోవడంతో అతని స్థానంలో టామ్ లాథమ్‌కు జట్టు నాయకత్వ బాద్యతలు అప్పగించారు.  

భారత్ vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్: అక్టోబర్ 16 - 20 (బెంగళూరు)
  • రెండో టెస్ట్: అక్టోబర్ 24- 28 (పూణె)
  • మూడో టెస్ట్: నవంబర్ 1 - 5 (ముంబై)