IND vs NZ 2024: భారత్‌ను ఓడించవచ్చు.. క్రికెట్ దేశాలకు మేమే స్ఫూర్తి: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

టీమిండియాతో స్వదేశంలో మ్యాచ్ అంటే సిరీస్ కు ముందు ప్రత్యర్థి సగం ఆశలు వదులుకుంటుంది. 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ అనేసరికి మరో సిరీస్ ఖాతాలో వేసుకోవచ్చు అనుకున్నారు. అయితే రెండు వారాలు గడిచేసరికి భారత్ కు న్యూజిలాండ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.

భారత్ లో టెస్ట్ మ్యాచ్ గెలవడమే కష్టం అనుకున్న దశలో.. పూణే టెస్టులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకొని  సంచలనం సృష్టించింది. తమ దేశ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియాపై నెగ్గి 12 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also Read :- ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ .. వేలంలోకి రానున్న స్టార్ ఆటగాళ్లు వీళ్ళే

భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం (నవంబర్ 1) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "12 ఏళ్ళ తర్వాత భారత్ జైత్ర యాత్రకు స్వదేశంలో బ్రేక్ లు పడ్డాయి. వరుసగా స్వదేశంలో 18 సిరీస్ లు గెలుచుకున్న భారత్ ను ఓడించడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇండియాను ఇండియాలో ఓడించడం సాధ్యమేనని ఇతర జట్లకు మా ద్వారా నిరూపించబడింది". అని సౌథీ చెప్పకొచ్చాడు. 

చివరి టెస్ట్ మ్యాచ్ లోనూ కివీస్ గెలిస్తే భారత సుదీర్ఘ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. సొంతగడ్డపై భారత్ చివరిసారిగా 2000 సంవత్సరంలో సిరీస్ కోల్పోయింది. సౌతాఫ్రికాపై భారత్ 2000 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో 0-2 తేడాతో ఓడిపోయింది. ముంబైలో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు తేడాతో ఓడిన భారత్.. ఆ తర్వాత బెంగళూరు టెస్టులో ఇన్నింగ్స్ 71 పరుగుల తేడాతో ఓడిపోయింది.భారత్ గడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన చివరి జట్టు సౌతాఫ్రికా. 24 ఏళ్ళ తర్వాత కివీస్ కు వైట్ వాష్ చేసే అవకాశం వచ్చింది.