న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య చివరిదైన మూడో టెస్ట్ శనివారం (డిసెంబర్ 14) ప్రారంభమైంది. హామిల్టన్ వేదికగా సీడెన్ పార్క్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీకి చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. దీంతో ఈ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఎమోషనల్ అయ్యాడు. తన కుటుంబం కూడా సౌథీని చూడడానికి స్టేడియానికి వచ్చారు. చివరి టెస్ట్ మ్యాచ్ కావడంతో సౌథీ తన ఫ్యామిలీతో కలిసి కన్నీరు పెట్టుకున్నాడు.
సౌథీ గత నెలలో (నవంబర్ 15) తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2008 లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ళ పాటు కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం కఠినమైన నిర్ణయమని.. రిటైర్మెంట్ కు ఇదే సరైన నిర్ణయమని శుక్రవారం (నవంబర్ 15) సౌథీ తెలిపాడు. న్యూజిలాండ్ వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోకపోతే.. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ తన టెస్ట్ కెరీర్ లో చివరిదని అని సౌతీ చెప్పుకొచ్చాడు.
ALSO READ : IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియా బ్యాటింగ్.. తొలి సెషన్‌కు వర్షం అంతరాయం
సౌథీ ఇప్పటివరకు కివీస్ తరపున 107 టెస్టుల్లో ఆడాడు. 201 ఇన్నింగ్స్ లో 389 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనతను 15 సార్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా సౌథీ కొనసాగుతున్నాడు. 431 వికెట్లతో రిచర్డ్ హ్యడ్లి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. తొలి రెండు సెషన్ లు ముగిసే సరికీ 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లేతమ్ 63 పరుగులు చేసి రాణించాడు.
Tim Southee and his daughter lead the teams out onto the field for his 107th and final Test ? pic.twitter.com/qv3GBjn6YK
— ESPNcricinfo (@ESPNcricinfo) December 13, 2024