టిమ్ కుక్ సాలరీ.. ఉద్యోగి జీతం కంటే  1,447 రెట్లు ఎక్కువ

టిమ్ కుక్ సాలరీ.. ఉద్యోగి జీతం కంటే  1,447 రెట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: కిందటేడాది యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌, ఈ టెక్ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగి జీతం కంటే  1,447 రెట్లు ఎక్కువ జీతాన్ని తీసుకున్నారు. స్టాక్ అవార్డులు వంటివి పొందడంతో  2021 లో ఆయన 100 మిలియన్ డాలర్లను జీతంగా అందుకున్నారు. కిందటేడాది యాపిల్‌లో సగటు ఉద్యోగి జీతం ఏడాదికి 68,254 డాలర్లు  కాగా, టిమ్‌ కుక్‌ 98.7 మిలియన్ డాలర్లను (రూ.7,402 కోట్లు) పొందారు. కుక్ శాలరీ 3 మిలియన్ డాలర్లుగానే కొనసాగుతోంది. కానీ, ఆయన 2021 లో 82.3 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ అవార్డులను పొందారు.  కంపెనీ పెట్టుకున్న టార్గెట్‌లను రీచ్ అవ్వడంతో మరో 12 మిలియన్ డాలర్లను, ఎయిర్‌‌ ట్రావెల్‌, ఇన్సూరెన్స్  ప్రీమియం, ఇతరత్రా కోసం మరో 1.4 మిలియన్ డాలర్లను పొందారు. అదే 2020 లో  ఆయన 14.8 మిలియన్ డాలర్లను మాత్రమే పొందడం గమనించాలి. 2011 లో టిమ్‌ కుక్ యాపిల్ సీఈఓ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత కంపెనీ షేరు 1000 %  పెరగడం విశేషం.  2011 లో 3,33,987 కంపెనీ షేర్లను లాంగ్‌ టెర్మ్ ఈక్విటీ ప్లాన్‌లో భాగంగా అందుకున్నారు. 2023 మళ్లీ ఇలా షేర్లను దక్కించుకుంటారని కంపెనీ వర్గాలు తెలిపాయి.