సూర్య చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు..నేను నమ్మకం నిలబెట్టా 

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌ : సౌతాఫ్రికాతో మూడో టీ20లో వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తానని తాను కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ను అడిగానని తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ చెప్పాడు. ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని వెల్లడించాడు. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన తిలక్‌‌‌‌‌‌‌‌ 33, 20 రన్సే చేశాడు. కానీ మూడో టీ20లో మూడో స్థానంలో వచ్చి సెంచరీతో చెలరేగిపోయాడు.

‘రెండో టీ20 సందర్భంగా తిలక్‌‌‌‌‌‌‌‌ నా దగ్గరికి వచ్చి మూడో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఇవ్వాలని కోరాడు. నన్ను నేను నిరూపించుకుంటానని చెప్పాడు’ అని సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ తర్వాత డగౌట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సూర్యను చూస్తూ తిలక్ ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌ కిస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి తన కృతజ్ఞతలు చెప్పాడు. ‘స్కై (సూర్య) కోసం ఇది. మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఇచ్చాడు. ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం నాకు చాలా ఇష్టం.

మ్యాచ్ ముందు రోజు నా దగ్గరకు వచ్చిన సూర్య మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో ఆడమని చెప్పాడు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించాడు. మీరు అవకాశం ఇచ్చారు. నా సత్తా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో చూపిస్తా అని చెప్పా’ అని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ తర్వాత తిలక్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు. తాము కొన్నిసార్లు విఫలమైనా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మద్దతుగా నిలిచిందన్నాడు.