హైదరాబాద్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా తిలక్ వర్మ

హైదరాబాద్, వెలుగు: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ నడిపించనున్నాడు.  ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ టీమ్‌‌‌‌‌‌‌‌ను సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టుకు తిలక్‌‌‌‌‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేశారు. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల తర్వాత ఈ జట్టును సమీక్షించనున్నారు. మరో ఏడుగురు ఆటగాళ్లను స్టాండ్‌‌‌‌‌‌‌‌బైగా ఎంపిక చేశారు.  ఈ నెల 23న జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మేఘాలయతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తమ పోరు ఆరంభించనుంది. 

హైదరాబాద్ టీమ్‌‌‌‌‌‌‌‌:  తిలక్ వర్మ (కెప్టెన్),  రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్,  రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, టి. రవితేజ, బుద్ధి రాహుల్, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రాహుల్ రాదేశ్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), శరణు నిశాంత్, రక్షణ్‌ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, అమన్ రావు.