ఐసీసీ టీ20 ర్యాంక్‌‌లో తిలక్‌‌ వర్మ @3

దుబాయ్‌‌ : తెలుగు బ్యాటర్‌‌ తిలక్‌‌ వర్మ.. ఐసీసీ టీ20 ర్యాంక్‌‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన జాబితాలో తిలక్‌‌ (806) ఏకంగా 69 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌‌లోకి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌‌లో తిలక్‌‌ రెండు సెంచరీలతో కలిపి 280 రన్స్‌‌ చేయడం అతని ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. కెప్టెన్‌‌ సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (788) ఒక్క ప్లేస్‌‌ కిందకు దిగజారి నాలుగో ర్యాంక్‌‌లో నిలిచాడు. 

సంజూ శాంసన్‌‌ (598).. 17 ప్లేస్‌‌లు మెరుగుపడి 22వ ర్యాంక్‌‌కు చేరాడు. యశస్వి జైస్వాల్‌‌ (706), రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (619) వరుసగా 8, 15వ ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. ట్రావిస్‌‌ హెడ్‌‌ (855), ఫిల్‌‌ సాల్ట్‌‌ (828) టాప్‌‌–-2లో ఉన్నారు. బౌలింగ్‌‌లో రవి బిష్ణోయ్‌‌ (666), అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ (656) వరుసగా 8, 9 ర్యాంక్‌‌లను సాధించారు. అక్షర్‌‌ పటేల్‌‌ (623) 13వ ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌‌రౌండ్‌‌ లిస్ట్‌‌లో హార్దిక్‌‌ పాండ్యా (244) రెండు స్థానాలు ఎగబాకి టాప్‌‌ ర్యాంక్‌‌ను సొంతం చేసుకున్నాడు.