యూట్యూబ్ – టిక్ టాక్ ఆన్ లైన్ వార్ లో వెనబడిన టిక్ టాక్ మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇండియాలో టిక్ టాక్ చేయాలని పిలుపునిస్తూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ లు హల్ చల్ చేశాయి. దీంతో నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని కామెంట్లు పెట్టారు. ఆ ట్యాగ్స్, కామెంట్లు కారణంగా టిక్ టాక్ 4.2 నుంచి 3కి మూడు నుంచి 1.2 రేటింగ్స్ కు పడిపోయింది.
రేటింగ్స్ పడిపోవడంతో అప్రమత్తమైన గూగుల్ ..టిక్ టాక్ కు వ్యతిరేకంగా ఉన్న 5మిలియన్ల మెసేజ్ లను డిలీట్ చేసింది. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా టిక్ టాక్ రేటింగ్ పెరిగినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా టిక్ టాక్ యాప్ పై వచ్చిన 80 లక్షల నెగెటివ్ రివ్యూలను గూగుల్ సంస్థ తొలిగించింది. దీంతో ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ 4.4 స్టార్ రేటింగ్‌తో తిరిగి యథాస్థితికి చేరుకుందని ఎన్డీటీవీ గాడ్జెట్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.
