గాంధీ ఆస్పత్రిలో భారీ బందోస్తు : అక్కడే అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు

సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ ను.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు. అక్కడ రిమాండ్ రిపోర్టు ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత.. గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వీవీఐపీల తాకిడి, ఫ్యాన్స్ హడావిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. గాంధీ ఆస్పత్రి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. భారీగా మోహరించారు.

అల్లు అర్జున్ గాంధీ ఆస్పత్రికి వస్తున్నట్లు.. ఇప్పటికే సమాచారం ఇచ్చారు పోలీసులు. దీంతో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు చేయటానికి అంతా రెడీ అయ్యింది. 

గాంధీ ఆస్పత్రిలో పరిసరాల్లో భారీగా పోలీసులు ఉన్నారు. పేషెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా వాళ్లను పంపించటం లేదు. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రి దగ్గర ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రెగ్యులర్ గా ఉండే భద్రత కంటే అదనంగా.. మరో 100 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.