జనవరి 2 నుంచి బీటింగ్ రిట్రీట్ టికెట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ, వెలుగు: కర్తవ్య పథ్‌‌‌‌పై జరిగే రిపబ్లిక్ డే పరేడ్–2025 కార్యక్రమానికి సంబంధించి టికెట్ల అమ్మకాలను గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. జనవరి 28న జరిగే ఫుల్​డ్రెస్ బీటింగ్ రిట్రీట్, 29న జరిగే రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవం బీటింగ్ రిట్రీట్ టికెట్లనూ విక్రయించనున్నట్లు తెలిపింది. ఈమేరకు రక్షణ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌లైన్లలో టికెట్లు విక్రయిస్తామని పేర్కొంది. Aamantran.mod.gov.in, Aamantran యాప్ ద్వారా ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే, సేన్ భవన్, శాస్త్రీ భవన్, జంతర్ మంతర్, ప్రగతి మైదాన్, 

రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర టికెట్లు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.