హైదరాబాద్‌‌ గ్రాండ్ విక్టరీ .. 50 రన్స్ తేడాతో పుదుచ్చేరిపై గెలుపు

హైదరాబాద్‌‌, వెలుగు: రంజీ ట్రోఫీలో రెండు వరుస పరాజయాల తర్వాత హైదరాబాద్‌‌ తొలి గెలుపు రుచి చూసింది. బౌలింగ్‌‌లో తనయ్‌‌ త్యాగరాజన్‌‌ (7/106) చెలరేగడంతో.. మంగళవారం ముగిసిన ఎలైట్‌‌ గ్రూప్‌‌–బి మూడో మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ ఇన్నింగ్స్‌‌ 50 రన్స్‌‌ తేడాతో పుదుచ్చేరిపై గెలిచింది. 171/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన పుదుచ్చేరి రెండో ఇన్నింగ్స్‌‌లో 119.3 ఓవర్లలో 333 రన్స్‌‌కు ఆలౌటైంది.

   శ్రీధర్‌‌ రాజు (106) సెంచరీతో చెలరేగాడు. ఆకాశ్‌‌ కర్గావే (31), అంకిత్‌‌ శర్మ (22 నాటౌట్‌‌), మరిముతు   (21) ఓ మాదిరిగా ఆడారు. మిలింద్‌‌, రక్షణ్‌‌ రెడ్డి, రోహిత్‌‌ రాయుడు తలా ఓ వికెట్‌‌ తీశారు. తనయ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. వచ్చే నెల 6 నుంచి జరిగే నాలుగో రౌండ్ మ్యాచ్‌లో  హైదరాబాద్‌‌.. రాజస్తాన్‌‌తో తలపడుతుంది.