రైతుభరోసాపై చర్చ: అసెంబ్లీలో మంత్రి తుమ్మల vs కేటీఆర్

రైతుభరోసాపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీమంత్రి కేటీఆర్ మధ్య  హాట్ హాట్ డిస్కషన్ జరిగింది.   గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా రైతు బందు ఇచ్చారన్నారు  తుమ్మల నాగేశ్వర్ రావు. రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా  మాట్లాడారు.  గత 12 సీజన్లలో 80 వేల కోట్ల రైతుబంధు ఇచ్చారని చెప్పారు. ధరణి పోర్టల్ ఆధారంగానే రైతుబంధు ఇచ్చారని..సాగు భూములకు రైతు బంధు అందలేదన్నారు తుమ్మల.  రైతు బంధు లోపాలు సరిదిద్ది రైతుభరోసా ఇస్తామన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు.   21,082 కోట్లు వృథా అయ్యాయని ఆరోపించారు.

సాగు భూములకే రైతు బంధు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం సబ్ కమిటీ నియమించిందని చెప్పారు. సంక్రాంతి లోపే రైతుభరోసాపై  విధివిధానాలు రూపొందించి రైతుబందు ఇస్తామన్నారు. రైతుభరోసాపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాన్ని సేకరించామని చెప్పారు. రైతుభరోసాపై ప్రతిపక్షాలు విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు.  సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

తుమ్మల వ్యాఖ్యలపై మాట్లాడిన కేటీఆర్..  తాము నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామన్నారు కేటీఆర్.  రూ21 వేల రైతు బంధు వృథా అనేది అవాస్తవమన్నారు.రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.  పత్తి రైతులకు ఒక పంటకు రైతుబంధు ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా?  పోడు పట్టాలున్న రైతులకు  రైతుబంధు ఇస్తారా?ఇవ్వరా. కంది సాగు చేసిన రైతులకు రైతుబంధు ఇస్తారా?  హర్టికల్చర్ రైతులకు రైతుబంధు ఇస్తారా? ఎన్ని పంటలకు..ఏయే  పంటలకు రైతుబంధు ఇస్తారో చెప్పాలి.  బీఆర్ఎస్  హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ అన్నారు. అయితే వెంటనే కల్గజేసుకున్న మంత్రి తుమ్మల .. రైతుభరోసాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏ పంటకు ఎంత ఇవ్వాలో సూచనలు ఇస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటదని చెప్పారు.