కేపీహెచ్​బీ కాలనీలో చైన్​ స్నాచింగ్​

కూకట్​పల్లి, వెలుగు : దుకాణానికి వెళ్లి వస్తున్న మహిళ మెడలోంచి ఓ దుండగుడు గోల్డ్​చైన్ కొట్టేశాడు. కేపీహెచ్​బీ కాలనీ ఆరో ఫేజ్ కు చెందిన మేక మణి(54) బుధవారం రాత్రి మరో మహిళతో కలిసి సమీపంలోని షాపుకు వెళ్లి వస్తోంది. ఓ యువకుడు వీరిని వెనుక నుంచి ఫాలో అయ్యాడు. 

అదును చూసి మణి మెడలోని గోల్డ్​చైన్​లాక్కొని పరిగెత్తాడు. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించినా దుండగుడు దొరకకుండా తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.