కావాల్సినవి : వినాయకుడి బొమ్మ, ఒక పేపర్ బాక్స్, కలర్ పేపర్, కత్తెర, గమ్, గోల్డ్ కలర్ డెకరేటివ్ పేపర్, కొన్ని అట్ట ముక్కలు.
తయారీ : అట్టముక్కకు మధ్యలో కత్తెరతో రెండు చీలికలు పెట్టాలి. దాన్ని ఖాళీ పేపర్ బాక్స్ మధ్యలో పెట్టి, గమ్‌తో అతికించాలి. చీలికల మధ్యలో మరో రెండు అట్ట ముక్కల్ని పెట్టి, బాక్స్ పైన మూత పెట్టాలి. ఆ బాక్స్ చుట్టూ గోల్డ్ కలర్ డెకరేటివ్ పేపర్ అంటించాలి. తరువాత కలర్ పేపర్ని పొడవుగా కత్తిరించాలి. అలాంటివి మూడు ముక్కలు రెడీ చేసుకోవాలి. వాటిని ఒక్కోటిగా మడతలు పెట్టి ఒకదానితో ఒకటి అతికించాలి. అప్పుడు బొమ్మలో చూపించినట్లు పువ్వు ఆకారంలో రౌండ్‌గా కనిపిస్తుంది. దాని మధ్యలో గోల్డ్ కలర్ పేపర్ అతికించాలి. అట్టముక్కల్ని రౌండ్‌గా చుట్టి, చివర అతికించి గొట్టాల్లా తయారుచేయాలి. వాటికి డెకరేటివ్ పేపర్ చుట్టి, దాన్ని బాక్స్‌కి రెండు వైపులా అతికించాలి. కావాలంటే ఇంకాస్త అందంగా ఉండేలా బొమ్మలో కనిపిస్తున్నట్టు పూసలు, వేరే కలర్ డెకరేటివ్ పేపర్స్ వంటివి వాడొచ్చు. చివరిగా వినాయకుడి బొమ్మను ఆ బాక్స్‌పై పెడితే బాగుంటుంది.
