కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న ముగ్గురు మహిళా ప్రయాణికులు మృతి చెందారు. మరో ఇద్దరు ప్యాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం (నవంబర్ 2) తెల్లవారుజూమున నందవరం మండలం ధర్మపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.