హిమాచల్ ప్రదేశ్​ లో ముగ్గురు ట్రెక్కర్లు మృతి

హిమాచల్ ప్రదేశ్​ లో ముగ్గురు ట్రెక్కర్లు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో ట్రెక్కింగ్‌కి వెళ్లిన పర్వతారోహకులు చనిపోయారు. మంచు తుఫానులో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారని ఇండో టిబిటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP)అధికారులు తెలిపారు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో  జరిగింది. ట్రెక్కర్ల టీంలోని  13 మందిలో 12 మంది మహారాష్ట్రకు చెందినవారు కాగా.. ఒకరు మాత్రం పశ్చిమబెంగాల్‌కి చెందినవారని అధికారులు చెప్పారు. 13 మందిలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందిని సురక్షితంగా కాపాడారు. 

వీరంతా అక్టోబర్‌ 17న కిన్నౌర్‌ జిల్లాలోని రోహ్రు నుండి బురువా గ్రామానికి తమ యాత్రను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా... బురువా కందా ఎగువ ప్రాంతంలో వారంతా చిక్కుకుపోయారు.  దీనికి సంబంధించి  సమాచారం అందుకున్న ఐటిబిపి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 15000 అడుగుల  దగ్గర మూడు మృతదేహాలు పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతదేహాలను వెలికితీయడానికి ITBP బృందం సోమవారం అక్కడికి చేరుకోకున్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన ముగ్గురు రాజేంద్ర పాఠక్‌, అశోక్‌ భలేరావు, దీపక్‌ రావుగా అధికారులు గుర్తించారు.